కరోనా లాక్ డౌన్ నుంచి క్రమంగా ఫ్రాన్స్ బయటకు వస్తుంది. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి ఇన్ని రోజులు కూడా ఆ దేశంలో లాక్ డౌన్ ని కొనసాగించారు. ఇప్పుడు అక్కడ కేసులు క్రమంగా తగ్గుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ఆంక్షలను క్రమ౦గా సడలించిన నేపధ్యంలో ప్రజలు కూడా నిదానంగా బయటకు వస్తున్నారు. 

 

ఇక తాజాగా ఒక థీం పార్క్ ని ఫ్రాన్స్ లో ఓపెన్ చేయగా అక్కడ ఒక భారీ మెషిన్ ఏనుగు ఆ ప్రాంతంలో ప్రజల మీద ఒక స్ప్రే చేస్తుంది. అది శానిటేషన్ చేస్తూ ముందుకు కదులుతుంది. దీనికి సంబంధించిన వీడియో ని రాయిటర్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతుంది. అయితే అది స్ప్రే చేసేది ఏంటీ అనేది అర్ధం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: