ప్రపంచం అంతా ఓ వైపు కరోనా భయం తో వణికిపోతుంటే.. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో మాత్రం ఉగ్రవాదులు తెగ రెచ్చిపోతున్నారు.  ఈ మద్య ఓ ప్రసూతి ఆసుపత్రిపై దాడి చేశారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా విచ్చలవిడిగా దాడి చేశారు.  ఇప్పుడు మరో దారుణానికి తెగబడ్డారు తీవ్రవాదులు.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కారు బాంబు దాడి జ‌రిగింది. ఘంజి సిటీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో అయిదుగురు మృతిచెందారు. 32 మంది గాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘ‌నిస్తాన్ ఇంటెలిజెన్స్‌ను టార్గెట్ చేస్తూ దాడికి పాల్ప‌డ్డారు. అయితే ఈదాడిలో ముఖ్యమైన వ్యక్తులు కూడా ఉన్నారు.

 

ఉగ్రవాదులు ష‌న‌ల్ డైర‌క్ట‌రేట్ సెక్యూర్టీ యూనిట్‌ పూర్తిగా టార్గెట్ చేసుకొని అత్యంత పాశవికంగా దాడులు చేసినట్లు గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.  కాగా, మరణించిన వారు  బాధితులంతా ఇంటెలిజెన్స్ ఉద్యోగులే అని తేలింది. కేంద్ర హోంశాఖ మంత్రి ఈ దాడిని ద్రువీక‌రించారు. దాడికి బాధ్య‌త వ‌హిస్తూ ఎవ‌రూ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. తాలిబ‌న్‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ దాడిక జ‌ర‌గ‌డం శోచ‌నీయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: