దేశ వ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న కష్టాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. వాళ్ళను ఆదుకునే నాథుడు ఇప్పుడు కరువయ్యాడు అనేది అర్ధమవుతుంది. వేలాది మంది ఇప్పుడు రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది. తినడానికి తిండి లేక ఒకరకంగా నరకం చూస్తుంటే సొంత ఊర్లకు వెళ్ళడానికి మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. 

 

తాజాగా ఒక వలస కార్మికుడు వెళ్తూ వెళ్తూ తన కాళ్ళకు చెప్పులు లేవు దానం చేయండి అంటూ వేడుకున్నాడు. గోరఖ్‌పూర్ జిల్లాలోని పిప్‌రైచ్ గ్రామానికి చెందిన తిలోకి కుమార్ అనే వలస కార్మికుడు, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలోని వస్త్ర పరిశ్రమలో పని చేయడానికి వెళ్ళాడు. అయితే అక్కడ పని లేకపోవడం తో తన బృందం తో కలిసి సొంత ఊరు వెళ్ళగా దారిలో చెప్పులు తెగిపోవడం తో కాళ్ళల్లో రక్తం వస్తుంది. దీనితో చెప్పులు ఉంటే ఇవ్వండి అంటూ వేడుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: