ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సరిహద్దులను తెరిచే అవకాశం ఉందా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కృష్ణా జిల్లా కర్నూలు జిల్లా సరిహద్దులను పూర్తిగా మూసివేయాలని, గుంటూరు జిల్లా సరిహద్దులను కూడా మూసి వేసి పశ్చిమగోదావరి సరిహద్దులను తెరవాలని ప్రజారవాణా విషయంలో అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. 

 

అలా జరగాలి అంటే పశ్చిమ గోదావరి సరిహద్దు జిల్లాలు తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి రాకపోకలు ఉండకూడదు. అందుకు ఓకే అయితే రెండు రాష్ట్రాల్లో ముందు ఈ జిల్లాల సరిహద్దులను తెరిచే ప్రయత్నం చేయవచ్చు అని అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణా సిఎం కేసీఆర్ దీనిపై అధికారులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. కేబినేట్ సమావేశంలో అధికారులతో చర్చిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: