సూర్యాపేటలో కరోనా పరిక్షలు నిలిపివేసిన విషయంలో తెలంగాణా హైకోర్ట్ కో విచారణ జరిగింది. ఏ విధంగా కరోనా పరిక్షలు నిలిపివేశారు అనేది ప్రభుత్వం వివరణ ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ప్రజలు నేరుగా వచ్చి కరోనా పరిక్షలు చేయించుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందా అని హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

 

కేరళ తరహాలో సంచార కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారా అని కోరింది. వెంటనే జిల్లాల వారీగా కరోనా పరిక్షలకు సబంధించిన వివరాలను కోర్ట్ కి సమర్పించాలి అని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఇక తదుపరి విచారణను మే 26 కి వాయిదా వేసింది హైకోర్ట్. పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలని హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: