దేశంలో ఓ వైపు కరోనా కేసులు పెరుగున్నాయి.. లాక్ డౌన్ పెంచుకుంటూ పోతున్నారు.  అయితే లాక్ డౌన్ వల్ల జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు.. రోడ్లపైకి వస్తే కరోనా వైరస్ ని అరికట్టలేమని మొదటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటూనే ఉన్నాయి.  ఇటీవల రోడ్లపైకి తక్కువ జనాలు తిరిగారు.. కానీ లాక్ డౌన్ సడలింపులు మొదలైన తర్వాత జైలు నుంచి ఇప్పుడే రిలీజ్ అయినట్టు ఒక్కసారే రోడ్లపైకి వస్తున్నారు. మొదటి నుంచి బటయకు వస్తే మాస్క్ ధరించాలి.. సామాజిక దూరం పాటించాలని చెబుతున్నా ఆ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు.  కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ప్రచారం సాగిస్తున్నా వాటికి జనం తూట్లు పొడుస్తున్న ఘటనలు అడపాదడపా చోటుచేసుకుంటున్నాయి. 

 

లాక్ డౌన్ నిబంధనలు లెక్క చేయకుండా..  వేలాది మంది వలస కార్మికులు  రామ్‌లీలా మైదానానికి పోటెత్తారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు మూడు శ్రామిక ప్రత్యేక రైళ్లు సోమవారం సాయంత్రం బయలుదేరుతున్నాయి. ఈ రైళ్లలో తమ పేర్లు రిజిస్టర్ చేయించుకునేందుకు జనం వేలాదిగా రామ్‌లీలాకు తరలివచ్చారు. వీరిలో పలువురు కనీసం మాస్క్‌లు కూడా ధరించలేదు. ఒకరో ఇద్దరో అయితే కంట్రోల్ చేయడానికి వీలుంటుంది.. వందల మంది ఒక్కసారే గుమి కూడటంతో పోలీసులు సైతం చేతులెత్తే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 4,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: