గోవాలో కరోనా కేసులు పెరగడంపై ఇప్పుడు ఆ రాష్ట్ర సిఎం ఆగ్రహంగా ఉన్నారు. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్ళీ అక్కడ 18 నమోదు కావడం చూసి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసులను కట్టడి చేయడానికి తాము సమర్ధవంతంగా వ్యవహరించామని అయితే తమ వ్యూహాలు తమ అడుగులను రైళ్ళు నాశనం చేశాయని ఆయన మండిపడుతున్నారు. 

 

రైళ్ళ నుంచి వచ్చే వారు కరోనా వైరస్ ని తీసుకుని వస్తున్నారని రైళ్ళను గోవా లో ఆపవద్దు అని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. తమకు అసలు రైళ్ళు వద్దని ఆయన స్పష్టం చేసారు. ఇక కేంద్ర రైల్వే శాఖకు కూడా ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. కాగా ఆ రాష్ట్రంలో కొత్తగా 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: