దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 90 వేల మార్కును దాటింది. అయితే కరోనా కేసులు అంత‌గా న‌మోదు‌కాని గోవాలో కొత్త కేసులు చోటుచేసుకున్నాయి.   ఆ మద్య కేరళాలో జీరో కేసులు నమోదు కాగా.. ఇప్పుడు మళ్లీ కేసులు ప్రారంభం అయ్యాయి. ఒక్క క‌రోనా కేసు కూడా లేని రాష్ట్రంగా గోవా పేరు మారుమోగింది. వేస‌వి తాపానికి త‌ట్టుకోలేని ప్ర‌జ‌లంద‌రూ  గోవాకి ప్ర‌యాణం మొద‌లుపెట్టారు. ఇంకేముంది అక్క‌డ కూడా క‌రోనా విజృంభించింది. అంతే ఇప్పుడు ఆ రాష్ట్రంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు మొదలయ్యాయి.   ముంబై నుంచి రైలులో గోవాకు వచ్చిన ఏడుగురు ప్ర‌యాణికులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో గోవాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29 మార్కును దాటింది.

 

ముంబై నుంచి గోవాకు రైలులో వచ్చిన సుమారు 100 మందికి కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.  త‌మ రాష్ట్రంలోకి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌క‌టించింది. అంతేకాదు ప‌రీక్ష‌ల కోసం ఒక్కొక్క‌రి నుంచి రూ. 2 వేలు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఢిల్లీ నుంచి రైల్లో వచ్చిన ఏడుగురికి, కర్ణాటక నుంచి వచ్చిన వలస కార్మికునికి పరీక్షలు చేయగా పాజిటీవ్‌ వచ్చింది. మే 12వరకు గోవాలో ఒక్క కేసుకూడా నమోదు కాలేదు.  గోవా ప్రభుత్వం ఇటీవ‌లే త‌మ రాష్ట్రాన్ని కరోనా రహితంగా ప్రకటించింది. తాజాగా కేసులు న‌మోదు కావ‌డంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: