కరోనా సాయంలో భారత్ కు పెద్దన్న అమెరికా అండగా నిలబడుతుంది. భారత్ మందులు ఇవ్వడం ఆ దేశం ఏదొకటి ఇవ్వడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ కి ఇచ్చే వెంటిలేటర్ల గురించి ప్రస్తావించారు. మొబైల్ వెంటిలేటర్లను 200 ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక్కో దాని ధర 13 వేల డాలర్ల(రూ. 9.6 లక్షలు)ని తెలుస్తుంది. 

 

ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో అవి వస్తాయి. మొత్తం 200 మొబైల్ వెంటిలేటర్లకు గాను అమెరికా 2.6 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుంది. అంటే దాదాపుగా 19 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చుని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్ఏఐడీ) భరించనుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: