కరోనా దెబ్బకు ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా భయపడుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా కట్టడి కాకపోవడం తో ఇప్పుడు ఎవరికి వారిగా చాలా వరకు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా నిబంధనలు ఉల్లంఘించింది అని ఒక ఫ్లైట్ ని నైజీరియా ప్రభుత్వం సీజ్ చేసేసింది. 

 

బ్రిటన్ సంస్థ ఫ్లెయిర్ ఏవీయేషన్‌కు చెందిన విమానాన్ని నైజీరియా ప్రభుత్వం సీజ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అందులో సిబ్బందిని కూడా అరెస్ట్ చేసింది సర్కార్. వారిపై ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఆ దేశంలో అసలే వైద్య సదుపాయాలు చాలా తక్కువ. ఏ చిన్న తేడా వచ్చినా సరే భారీగా మూల్యం చెల్లించాలి. ఆ విమానం నిషేధం ఉన్నా సరే ప్రయాణికులను తరలించడం పై ప్రభుత్వం సీరియస్ అయింది. వారికి శిక్ష ఖాయమని ప్రభుత్వం చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: