కేంద్రంపై తెలంగాణా సిఎం కేసీఆర్ కేబినేట్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ తో పాటుగా కేంద్రం విధానాలపై ఆయన చర్చించారు. 20 లక్షల కోట్ల తో ఏ ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. విద్యుత్ సంస్కరణల విషయంలో ఏ విధానాలు అయితే వద్దు అనుకున్నామో అదే విధానాన్ని అమలు చేస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయినట్టు సమాచారం. 

 

ఎలాంటి పరిస్థితి లో కూడా కేంద్రం షరతులకు తలోగ్గ వద్దని ఆయన కేబినేట్ లో అభిప్రాయపడినట్టు సమాచారం. ఎఫ్ ఆర్ బీ ఎం లో రుణ పరిమితిని పెంచడానికి షరతులు విధించడం పై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ప్రెస్ మీట్ లో ప్రకటన చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: