ప్రజలు ఎవరూ కూడా రాష్ట్రంలో రోడ్ల మీదకు రావొద్దని తెలంగాణా సిఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తే లేనిపోని ఇబ్బందులు వచ్చి మళ్ళీ లాక్ డౌన్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది అని అన్నారు. మెట్రో సర్వీసులను, పబ్ లు బార్లు, ఫంక్షన్ హాల్స్ ని జిమ్స్  ని అనుమతించేది లేదని పేర్కొన్నారు. 

 

అదే విధంగా సినిమా హాల్స్ ని మతపరమైన రాజకీయ సభలు అనుమతి లేదని, అన్ని రకాల ప్రార్ధనా మందిరాలు మూసి వేస్తున్నామని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు. పార్క్ లు స్విమ్మింగ్ ఫూల్స్, మైదానాలు అనుమతించేది లేదని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. హైదరాబాద్ తప్పా మిగతా అన్ని ప్రాంతాల్లో షాపులు తెరుచుకోవచ్చు అని కేసీఆర్ పేర్కొన్నారు. మెట్రో సర్వీసులను అవసరం బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.అన్ని రకాల విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్టు స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: