తెలంగాణాలో ఇష్టం వచ్చినట్టు పంట లు వేస్తే రైతు బంధు ని కట్ చేస్తామని రాష్ట్ర సిఎం కేసీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం చెప్పిన పంట లు వేస్తేనే రైతు బంధు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేసారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లకు అనుమతి ఇస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేసారు. ఒక కోటి 35 ల‌క్ష‌ల ఎక‌రాల‌తో తెలంగాణ‌లో వ్యవ‌సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. 

 

కాళేశ్వ‌రం నీటితో ఈ యేడాది మ‌రో 10 లక్ష‌ల్లో సాగు పెరుగుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు. వర్షపాతం కూడా ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ప‌త్తి దిగుబ‌డి ఎక్కువ వ‌స్తుంది.. ఈ యేడాది ప‌త్తి 17 ల‌క్షల్లో సాగ‌వుతుంద‌ని అంచ‌నా అంటూ వ్యాఖ్యానించారు. ప‌త్తితో అన్నీ ఖ‌ర్చులు పోను 50 వేలు మిగులుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. 70 లక్షల ఎకరాల్లో పత్తి వేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: