కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజి పై తెలంగాణా సిఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రాలపై పెత్తనం సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తుంది అని మండిపడ్డారు. రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం కట్టుకునే అప్పుకి కేంద్రం షరతులు ఏంటీ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

ప్రతీ 2500 కోట్లకు కేంద్రం ఆంక్షలు ఏంటీ అని ముష్టి 2500 కోట్లు తమకు వద్దని స్పష్టం చేసారు. కేంద్రం పెట్టిన షరతుల్లో ఇప్పటికే మూడు పూర్తి చేసామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తన పరువు తానే తీసుకుంది అని కేసీఆర్ ఆరోపించారు. కేంద్రం ప్యాకేజి మొత్తం బోగస్ అని స్పష్టం చేసారు. ఇది బోగస్ ప్యాకేజి అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: