IHG

కరోనా మహమ్మారి ప్రజల ను అతలాకుతలం చేస్తూవుంది. ఈ మహమ్మారి వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో తీవ్ర జ్వరం, ఊపిరి సలపలేని జలుబు ఉంటేనే కరోనా లక్షణంగా భావించారు. కానీ తాజాగా బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన విషయాన్నీ విన్న కొందరు ఆ విషయాన్నీ నమ్మలేక పోతున్నారు. అయితే కరోనా వచ్చిన వ్యక్తి తనచుట్టుపక్కల ఉన్న వాసనలను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతాడని చెప్పింది.

 

ఈ సందర్భంగా వాసనను గ్రహించలేక పోవడం మూడోవ  కరోనా లక్షణంగా అధికారిక జాబితాలో చేర్చారు. అయితే నిపుణులు మాత్రం ఈ విషయాన్నీ ఎప్పుడో చెప్పవలసి ఉంది కానీ చెప్పకపోవడంతో చాలావరకు కేసులు లెక్కకు రాకుండాపోయాయని చెబుతున్నారు. ఈ లక్షణాన్ని వైద్య పరిభాషలో అనోస్మియా అంటారు. కరోనా సోకిన దాదాపు 30 శాతం నుండి 50 శాతం రోగులలో ఈ లక్షణం ఉన్నట్లు  వైద్య బృందం గ్రహించారు. ఇప్పటికే అమెరికా తో సహా పలు దేశాలు ఇది కూడా కరోనా లక్షణమే అని రికార్డు చేశారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: