ప్రముఖ ఫ్రెంచ్ అగ్ర నటుడు మిచెల్ పిక్కోలి తుది శ్వాస విడిచారు. 94 ఏళ్ళ మిచెల్ గత వారం కన్ను మూసారని ఆయన కుటుంబం ఫ్రెంచ్ మీడియా కు వివరించింది. అయితే ఆయన ఏ విధంగా మరణించారు అనేది చెప్పలేదు. 1940 నుంచి ఆయన ఫ్రెంచ్ లో అగ్ర నటుడిగా ఉన్నారు. 

 

లే మెప్రిస్ (కాంటెంప్ట్) మరియు బెల్లె డి జోర్ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఆయన మూడు వివాహాలు చేసుకున్నారు. మనస్పర్దల కారణంగా ముగ్గురి తోను ఆయన విడాకులు తీసుకున్నారు. ఇక పలు ప్రఖ్యాత అవార్డులను కూడా ఆయన అందుకున్నారు. ఆయన మరణంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు సంతాపం ప్రకటించారు. ప్రముఖ హాలీవుడ్ నటులు కూడా ఆయన మరణానికి సంతాపం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: