కరోనా వైరస్ పై పోరాటంలో ఎవరి వంతుగా సహాయం వాళ్ళు అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఉండటం తో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా పై పోరాటంలో పంజాబ్ లోని పఠాన్ కోట్ కి చెందిన ఒక యాచకుడు ఇప్పుడు హీరో అయ్యాడు. తాను యాచించిన సొమ్ముతో పేదలకు ఆహారం అందిస్తున్నాడు అదే విధంగా రేషన్ బియ్యం కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాడు. 

 

గతంలో 22 మంది అమ్మాయిలకు అతను వివాహం కూడా చేసాడు. తన మూడు చక్రాల సైకిల్ మీద తిరుగుతూ అందరికి ఆహారం అందిస్తున్నాడు. కరోనా ఉన్నా సరే ఏ మాత్రం భయపడకుండా ఆయన తన వంతుగా సహాయ సహకారాలను అందించడం చూసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫిదా అయింది. ఇప్పటివరకు 100 పేద కుటుంబాలకు ఒక నెల రేషన్‌తో పాటు, మూడువేల‌ మాస్కులు పంపిణీ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: