కరోనా వైరస్‌ విసిరిన పంజాకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలమయ్యాయి.  కరోనా దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలమయ్యాయి. కాగా.. ప్రపంచంలో కరోనా లేని మరో దేశంగా కంబోడియా నిలిచింది. ఆ దేశంలో మొత్తం 122 కేసులు నమోదు కాగా.. వైరస్ సోకినా అందరూ కోలుకున్నారు. ఏ ఒక్కరు కూడా మరణించలేదు. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 48 లక్షల 90 వేలకు చేరింది.  3 లక్షల 19 వేల మంది కరోనాకు బలయ్యారు.

 

17 లక్షల 70 వేల మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం  26 లక్షల 69 వేల యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అమెరికాలో కేసుల సంఖ్య 15 లక్షల 44 వేలు దాటింది. అక్కడ మొత్తంగా మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది.  మొన్నటి వరకు నామ మాత్రంగా ఉన్న రష్యా లో కూడా కరోనా విజృంభిస్తుంది.   రష్యాలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. అక్కడ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉండగా..  2 వేల ఏడు వందల మంది కరోనాకు బలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: