కేంద్రం ప్యాకేజి పై తీవ్ర స్థాయి విమర్శలు చేసిన తెలంగాణా సిఎం కేసీఆర్ పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్రం అద్భుతమైన ప్యాకేజి ప్రకటించింది అని ఆయన కీర్తించారు. 20 లక్షల కోట్ల ప్యాకేజి లో తెలంగాణా కు న్యాయం జరగదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎఫ్ ఆర్ బీ ఎం సంస్కరణల లోపాలు ఏమున్నాయో కేసీఆర్ చెప్పాలని ఆయన నిలదీశారు. 

 

రాష్ట్రాల వాటా అని గతంలో కేసీఆర్ మంత్రి గా పని చేసినప్పుడు ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ఎఫ్ ఆర్ బీ ఎం పరిమితిని 3 శాతం నుంచి 5 శాతం కి పెంచామని ఆయన అన్నారు. నాలుగు నిబంధనల్లో రెండింటి ని ఇప్పటికే ఒప్పుకున్నారని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: