లాక్ డౌన్ కారణంగా నరక౦ చూస్తుంది మాత్రం వలస కార్మికులే అనేది వాస్తవం. వేలాది మంది వలస కూలీలు ఇప్పుడు సొంత ఊర్లకు వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాష్ట్రాల సిఎస్ లకు లేఖ రాసారు. వలస కూలీల తరలింపు కోసం రాష్ట్రాలు మరియు రైల్వే శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచనలు చేసారు. 

 

వలస కూలీల కోసం మరిన్ని రైళ్లు, బస్సులు నడపాలని సూచించారు. కాలినడకన నడిచి వెళ్లే వారికి సేదతీరడానికి సౌకర్యాలు, ఆహారం సరఫరా చేయాలని సదరు లేఖలో పేర్కొన్నారు. బస్సు, రైళ్ల వివరాలను వలస కూలీలకు చెప్పడంతో పాటుగా, అసత్య సమాచారాలపై వలస కూలీలకు స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: