కరోనా మాహమ్మారి వల్ల పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సాఫ్ట్ వేర్ రంగం మినహా మిగతా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ద్వారా పని చేసే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపులు విధించటంతో ఉద్యోగులు కంపెనీలకు రావాల్సిందేనని సంస్థలు పిలుపునిస్తున్నాయి. 
 
కొన్ని సంస్థలు మాత్రం ఉద్యోగులకు శాశ్వతంగా ఇళ్లనుంచే పని చేసే అవకాశాలను కల్పిస్తున్నామని సోషల్ మీడియాలో ప్రకటనలు చేశాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల తాజాగా వర్క్ ఫ్రం హోం గురించి స్పందిస్తూ శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తే అది ఉద్యోగుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు దెబ్బ తింటాయని... వ్యక్తిగతంగా చర్చించుకోవడాన్ని డియో కాల్స్ ఎప్పటికీ భర్తీ చేయలేవని వ్యాఖ్యలు చేశారు. వ్యక్తి మన పక్కనే ఉంటే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని... శాశ్వత వర్క్‌ ఫ్రమ్ హోమ్ వల్ల ఇబ్బందులు వస్తాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: