ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఓడిస్సా రాష్ట్రాలను తుఫాన్ వణికిస్తుంది. అంఫాన్ తుఫాన్ అత్యంత వేగంగా దూసుకు వస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న సముద్ర తీరంలో ఇప్పుడు అలలు ఎగసి పడుతున్నాయి. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ లో రాకపోకలను నిలిపివేశారు అధికారులు. ఉత్తర నైరుతి దిశగా తుఫాన్ పయనం చేస్తుంది. 

 

రేపు ఇది బెంగాల్ లో తీరం దాటనుంది. బంగాళాఖాతం మొత్తం కూడా ఇప్పుడు అలజడి గా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సొంపేట కవిటి మండలాల్లో సముద్రం 20 మీటర్ల మేర ముందుకు వచ్చింది. దీనితో మత్స్య కారులు తమ పడవలను జాగ్రత్త చేసుకుంటున్నారు. తీర ప్రాంతం ఇళ్ళల్లో నీళ్ళు చేరుతున్నాయి. ఇక దీనిపై కేంద్రం హైలెట్ అలెర్ట్ ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్ళాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: