వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేసారు. కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలు చేసారు. “కళ్లు మండుతున్నాయా’ అని అన్నది నిన్నే బాబూ. పొరుగు రాష్ట్రంలో ప్రవాస జీవితం. ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ. పక్కింటి వాళ్లు కూడా గుర్తించని అజ్ఞాతవాసం ఎక్కడ. బయట అడుగుపెడితే క్షణాల్లో వీడియోలు సోషల్ మీడియాకెక్కుతున్నాయి. 

 

ఎంత కష్టం వచ్చిపడిందని ఒక ట్వీట్ చేసారు. ఆ క్షణం కోసం ఎల్లో మీడియా వారం రోజులపాటు ఎదురు చూసింది. ఎడిటోరియల్స్, కాంగ్రెస్ వాళ్లని రెచ్చగొట్టడాలు, టీవీల్లో జలజగడాలంటూ తగాదా పెట్టే చర్చలు అన్నీ నీరు కారిపోయాయి. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఏదో అంటారని ఆశపడి భంగపడ్డారు. బాబు కూడా లైవ్ చూశాడంట ఏదైనా వినిపిస్తుందేమో అని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: