ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నీటి వాడకం విషయంలో కృష్ణా యాజమాన్య బోర్డ్ షాక్ ఇచ్చింది. ఏపీ జలవనరులశాఖ ఈఎన్‌సీకి కృష్ణా రివర్‌ బోర్డు తాజాగా ఒక లేఖ రాసింది. సాగర్‌ కుడికాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదలను ఆపాలని, మీ వాటా ప్రకారం మీరు ఇప్పటికే వాడుకున్నారని పేర్కొంది. 

 

మే నెల వరకు చేసిన కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకున్నారని బోర్డు తన లేఖలో స్పష్టం చేసింది. నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విధిగా పాటించాలని, ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని సూచించింది. హంద్రీనీవా నుంచి 47.17 టీఎంసీలు వాడుకున్నారని, సాగర్ కుడి కాలువ నుంచి 158.16 టీఎంసీలు వాడుకున్నారని లేఖలో ప్రస్తావించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: