కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లోచిక్కుకున్న వలస కూలీల ఆవేదన చూసి కేంద్రం వారికి స్వస్థలాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి లక్షలాది మంది  వలస కూలీలు తమ గమ్య స్థానం చేరుకునేందుకు రకరకాల పద్దతుల్లో వెళ్తున్నారు.  ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు వలసకూలీలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.  సామాజిక దూరం, మాస్క్ లు ధరించకపోవడం తో పోలీసులు రంగంలోకి దిగారు.  మంగళవారం బాంద్రా నుంచి పూర్ణియాకు ప్రత్యేక శ్రామిక్‌ రైలు బలయదేరి వెళ్లింది. అయితే ఈ రైలులో స్వగ్రామాలకు వెళ్లేందుకు పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కూలీలతోపాటు, రిజస్టర్ చేసుకోని వారు కూడా పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. 

 

అయితే ఎన్ని జాగ్రత్త చర్యలు చెప్పినా లేక్కచేయకపోవడంతో..  పోలీసులు లాఠీచార్జి చేశారు. అందరూ రైల్వేస్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేర్లు నమోదు చేసుకోని వారు వెనక్కు వెళ్లాలని హెచ్చరించినా కూలీలు వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం పేర్లు నమోదైన వారిని లోపలికి అనుమతించి రైలులో పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: