IHG

ఎన్నో దశాబ్దాలుగా కాశ్మీర్ అంశం పాక్ మరియు భరత్ ల మధ్య నలుగుతూ ఉంది. మొన్నటి కాశ్మీర్ అంశం గురించి సోషల్ మీడియాలో తాలిబన్ ప్రకటనగా వెలువడిన అంశం భరత్ ను ఒక్కింత నిరాశకు గురిచేసింది. ఈ ప్రకటనతో పాకిస్తాన్ కి కాస్త ఊపిరి పీల్చుకున్నట్లైంది. ఈ ట్వీట్ లో “కశ్మీర్‌ సమస్యకు చెక్ పడేంత వరకు.. భారత్‌తో ఎలాంటి సత్సంబంధాలు ఉండవని తాలిబన్ ప్రకటించినట్లు” ఉంది. ఈ ట్వీట్ కాస్త తెగ వైరల్ అయ్యింది కూడా. అయితే ఈ ప్రకటన చూసిన తాలిబన్ పొలిటికల్ వింగ్‌కు చెందిన ఇస్లామిక్‌ ఎమిరేట్స్ ఆఫ్‌ ఆఫ్ఘనిస్థాన్ మీడియా ప్రతినిధి సుహైల్‌ షాహీన్ ఓ అధికారిక ప్రకటన చేశారు.

 

 

అదేంటంటే తాలిబన్ పేరిట సోషల్ మీడియా లో వైరల్ అయిన కాశ్మీర్ అంశం మేము చేసినది కాదని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ జీహాద్ పేరిట మారణ హోమం చేస్తుందని తెలియజేసారు. మతం పేరిట మేము ఎన్నడూ ఆలా చేయబోమని ప్రకటించారు. అయితే కాశ్మీర్ ఎప్పటికి భరత్ కు చెందినదే అని ఈ సందర్భంగా తాలిబన్ నాయకుడు తెలియ జేశారు. మా మద్దతు ఎప్పుడు భరత్ కి ఉంటుందని తెలిపారు. ఈ ప్రకటనతో పాకిస్తాన్ నోట్లో వెలగ పండు పడినట్లు అయ్యింది. అయితే తాలిబన్ పేరిట వచ్చిన ఆ వార్తను భారత్ పరిశీలించినప్పటికీ సైలెంట్ గానే ఉంది. అయితే తాలిబన్ నాయకుడు ఈ వార్త గురించి ప్రస్తావించడం పాకిస్తాన్ కి మింగుడు పాడడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: