తెలంగాణలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గ‌డం లేదు. ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌లో ఆందోళ‌న‌క‌ర‌గా మారుతోంది. తాజాగా.. ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా సోకింది. హైదరాబాద్‌ పాత మలక్‌పేట డివిజన్‌లో నలుగురు అన్నదమ్ములు, ఓ సోదరి కుటుంబాలు సమీప కాలనీల్లో నివసిస్తున్నాయి. వైరస్‌ సోకుతుందనే విషయాన్ని మ‌రిచిపోయి.. తరచూ కలుసుకొనేవారు. మొదట వాహెద్‌నగర్‌లో ఒకరికి న్యుమోనియా రాగా, గాంధీ దవాఖానకు తరలించారు.

 

నాలుగురోజుల కిందట కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో అతడు కలిసిన వారి కుటుంబసభ్యులను 26 మందిని వైద్యాధికారులు సరోజినీదేవి దవాఖానకు తరలించి పరీక్షలు నిర్వహించగా, వారిలో శంకర్‌నగర్‌లోని ముగ్గురికి, సరోజినీనగర్‌కాలనీలోని ముగ్గురికి, హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఇద్దరికి వైరస్‌ సోకినట్టు తేలటంతో వారిని కూడా గాంధీకి తరలించి వారి నివాసాలను కంటైన్మెంట్‌ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: