తెలంగాణ‌లో పంటలసాగు విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 21న విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, అధికారులు, రైతు సంఘాల నేతలు హాజరుకానున్నారు. జిల్లాల వారీగా పంటల సాగుపై సమావేశంలో చర్చ జరుగనుంది. వరి సాగు ఏ రకం, ఎక్కడెక్కడ వేయాలనే అంశంపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత జిల్లాల వారీగా పంటల మ్యాప్‌ను అధికారులు రూపొందించనున్నారు.

 

కేసీఆర్ ఆమోదంతో పంటలు సాగు విధానంపై ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. మొన్న జ‌రిగిన మంత్రివ‌ర్గ భేటీ అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కేసీఆర్ వ్య‌వ‌సాయ విధానాన్ని వివ‌రించిన విష‌యం తెలిసిందే. ఏ పంట ఎన్ని ఎక‌రాల్లో వేయాలో కూడా ఆయ‌న చెప్పిన విష‌యం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: