కేంద్ర కేబినెట్ కీల‌క భేటీ జ‌రుగ‌నుంది. ఈ రోజు ఉద‌యం 11గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మంత్రుల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశంలో తాజా ప‌రిస్థితుల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ప్ర‌ధానంగా దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి, క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, లాక్‌డౌన్ అమ‌లు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెండో ఉద్దీప‌న ప్యాకేజీకి సంబంధించి కేటాయింపులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. వాటి అమ‌లు తీరుపై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

 

వ‌ల‌స కార్మికుల త‌ర‌లింపు, వందేభార‌త్ మిష‌న్‌, సాధార‌ణ రైళ్ల ఏర్పాటు ఇలా కీల‌క అంశాల‌ను ప్ర‌ధాని ప్ర‌స్తావించనున్న‌ట్లు ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలో మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో ఎలాంటి నిర్ణ‌యాలు ఉండబోతున్నాయ‌న్న‌దానిపై ప్ర‌జ‌లు ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: