దేశ ఆర్ధిక రాజధానిగా ఉండే మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. కట్టడి చేయడానికి చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలించడం లేదనేది అర్ధమవుతుంది. ఇక అక్కడ ఇప్పుడు ఆస్పత్రుల కొరత అనేది తీవ్ర స్థాయిలో ఉన్నట్టు తెలుస్తుంది. ముంబై లీలావతి ఆసప్త్రి వైద్యుడు జలీల్ పార్కర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

రాబోయే కాలంలో ఐసీయు పడకల కొరత ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి, చ‌ర్య‌లు తీసుకోవాలని, రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు పూర్తిగా విఫలమవుతున్నాయని ఆయన ఆరోపించారు. అక్కడ 27 వేల మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. ముంబై లోనే 25 వేలకు పైగా కరోనా బాధితులు ఉన్నారు. దీనితో ఆంక్షలు సడలించే అవకాశం లేదని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: