ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో తన అధికారిక పర్యటనల్లో ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులతో సంభాషిస్తానని కానీ దేశంలో కరోనా విజృంభణ వల్ల నెలకొన్న పరిస్థితుల వల్ల, లాక్ డౌన్ వల్ల వారిని కలవడం సాధ్యం కావడం లేదని చెప్పారు. మేఘాలయకు చెందిన కోటి మంది లబ్ధిదారులతో ఫోన్ ద్వారా సంభాషిస్తున్నట్లు మోదీ తెలిపారు. కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. 
 
మోదీ సర్కార్ ప్రజల ఆరోగ్యం లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్‌ను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ను ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వం పేద వారికి ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. గతంలో లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలిసిన మోదీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల వల్ల టెలిఫోన్ లో సంభాషిస్తున్నట్టు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: