కరోనా వైరస్, లాక్ డౌన్ సమస్య వలస కార్మికులకు పెద్ద శాపం అవుతోంది.అనేక మంది ఎది దొరికితే ఆ వాహనం ఎక్కి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. బిహార్‌లోని బగల్‌పూర్‌లో నౌగచియాలో మంగళవారం మరో ఘోరం జరిగింది. బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 9మంది వలస కూలీలు మృతిచెందారని సమాచారం వచ్చింది.  అంతకు ముందు మరో ప్రమాదంలొ 23 మంది వలస కూలీలు దుర్మరణం చెందారు.  ఈ ఒక్క వారం రోజుల్లోనే వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఎప్పుడైతే లాక్ డౌన్ సడలించి.. వలస కూలీలకు తమ స్వస్థలాలకు వెళ్లమని చెప్పినప్పటి నుంచి వాహనాల రద్ది పెరిగిపోవడం.. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటావా నగరం ఫ్రెండ్స్ కాలనీ ఏరియాలో రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి.

 

ఘటనలో ఆరుగురు రైతులు దుర్మ‌ర‌ణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సైఫైయ్ మెడిక‌ల్ కాలేజీకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. సిటీ ఎస్పీ ఆర్ సింగ్ ఘ‌ట‌నాస్థ‌లిని ప‌రిశీలించారు. రైతులు ప‌న‌స పండ్లు అమ్మేందుకు మార్కెట్కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ప్రమాదం జరగడంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జాం అయింది. విషయం తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకొని.. ప్రమాదానికి కారణమైన వాహనాలను తొలగించి.. ట్రాఫిక్ క్లియర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: