ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫాన్ తుఫాన్ ఇప్పుడు రెండు రాష్ట్రాలకు చుక్కలు చూపిస్తుంది. అత్యంత వేగంగా దూసుకు వస్తుంది తుఫాన్. పశ్చిమ బెంగాల్ ఓడిస్సా తీర ప్రాంతాలు ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతున్నాయి. తుఫాన్ వేగం బలంగా ఉండటమే కాకుండా తుఫాన్ తీరానికి సమీపిస్తున్న కొద్దీ కూడా వీస్తున్న  గాలులు భయపెడుతున్నాయి. 

 

ఇక తుఫాన్ తీవ్రతకు అక్కడి పోర్ట్ లలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. ఇక ఇదిలా ఉంటే అక్కడి తుఫాన్ తీవ్రతకు సంబంధించి జాతీయ మీడియా కొన్ని వీడియో లను పోస్ట్ చేసింది. ఓడిస్సా లోని బాలాసోర్ జిల్లాల్లో ఈదురు గాలులు భయపెడుతున్నాయి. అక్కడి భారీ వృక్షాలు కూడా పడిపోయే స్థాయిలో గాలులు వేస్తున్నాయి. ఈ వీడియో లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: