దేశ వ్యాప్తంగా ఇప్పుడు వలస కార్మికులు తమ సొంత ఊర్లకు వెళ్ళడానికి గానూ... పడుతున్న కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజు రోజుకి కూడా లాక్ డౌన్ ని పెంచే సూచనలు ఎక్కువగా కనపడట౦ పనులు ఉండే పరిస్థితులు లేకపోవడం తో చాలా మంది సొంత ఊర్లకు వెళ్ళడానికి గానూ ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శ్రామిక్ ట్రైన్స్ లో సొంత ఊర్లకు వెళ్ళడానికి కష్టాలు పడుతున్నారు. 

 

ఈ క్రమంలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే జనాలు ఎక్కువగా ఒక చోటకు వచ్చేస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. తాజాగా కోయంబత్తూర్ లో వేల మంది వలస కార్మికులు రైల్వే స్టేషన్ కి వచ్చేశారు. ఉత్తర ప్రదేశ్ & బీహార్ వెళ్ళడానికి 'ష్రామిక్ స్పెషల్' రైళ్ల కోసం రైలు పాస్లు సేకరించడానికి గానూ కోయంబత్తూరులోని సుందరపురం వద్ద వలస కార్మికులు అధిక సంఖ్యలో వచ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: