మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి అవాస్తవాలు చెబుతోందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనేవారు లేరని... రైతులను ఎవరూ ఆదుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతోందని జగన్ కు కరెంట్ పై అవగాహన లేదని అన్నారు. గత ఐదేళ్లలో కరెంట్ బిల్లులను టీడీపీ పెంచలేదని అన్నారు. 
 
ప్రభుత్వం రాష్ట్రంలో మూడు నెలల కరెంట్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మడ అడవులను ధ్వంసం చేసిందని వ్యాఖ్యలు చేశారు. పేద కుటుంబాలకు 5,000 చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వానికి మనస్సు రాలేదని అన్నారు. జపాన్ చెప్పినా వినకుండ జగన్ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేశారని వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వానికి విశ్వసనీయత లేదని విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: