కేంద్ర కేబినేట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రైతుల గురించి కూడా చర్చించారు. రైతులకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా రైతులకు ధాన్యం నిల్వలపై పరిమితిని కూడా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగానికి రూ .10,000 కోట్ల వ్యయంతో "మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఫార్మలైజేషన్ స్కీమ్" ని కేబినెట్ ఆమోదించింది. 

 

అదే విధంగా ఎన్‌బిఎఫ్‌సి / హెచ్‌ఎఫ్‌సిల లిక్విడిటీ స్థానాన్ని మెరుగుపరిచేందుకు గానూ నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల (ఎన్‌బిఎఫ్‌సి) మరియు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సి) కోసం కొత్త ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ప్రారంభించాలన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను పిఎం నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ ఆమోదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: