ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ఉల్లంఘన ఇప్పుడు తీవ్ర దుమారంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు సామాజిక దూరం పాటించడం లేదని మరి ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారు అంటూ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా దీనిపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశి౦చి హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. వైసీపీ ఎమ్మెల్యేల లాక్‌డౌన్‌ ఉల్లంఘలనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

 లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై సీబీఐ విచారణ ఎందుకు ఆదేశించకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. లాక్‌డౌన్ నిబంధనలు ప్రజాప్రతినిధులుగా అమలుచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం, లబ్ధిదారులతో ముఖాముఖిలో భాగంగా జరిగిందన్న ప్రభుత్వ లాయర్, ప్రజాప్రతినిధులే నిబంధనలు పాటించలేదని ఏపీ హైకోర్టు మండిపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: