తెలంగాణాలో ఆర్టీసి బస్సులు మొదలయ్యాయి. వందల బస్సులు ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చాయి. రెండు నెలలుగా ఒక్క బస్సు కూడా తిరగలేదు. ఇక ఈ తరుణంలో సామాజిక దూరంతో పాటుగా అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ ఇప్పుడు బస్సులను నడుపుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఇదే సమయంలో శానిటేషన్ కూడా చాలా కీలకం అని చెప్తున్నాయి. 

 

తాజాగా శానిటైజర్ లేని ఒక బస్ కండక్టర్ కి తెలంగాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ షాక్ ఇచ్చారు. కోదాడ బస్ ని ఆయన తనిఖీ చేయగా బస్సులో శానిటైజర్ లేదు. దీనితో శానిటైజర్ ఎందుకు తీసుకోలేదు అని కండక్టర్ ని ప్రశ్నించగా డిపో లో ఇవ్వలేదు అని సమాధానం ఇవ్వడం తో డిపో మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడారు. మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: