ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబుల్లో కరోనా పరిక్షలు చికిత్సలపై హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. గాంధీ ఆస్పత్రి నిమ్స్ లోనే పరిక్షలు చేయించుకోవాలి అనడం రాజ్యాంగ విరుద్దమని హైకోర్ట్ అభిప్రాయపడింది. ప్రైవేట్ ఆస్పత్రులపై నమ్మకం లేనప్పుడు ఆరోగ్య శ్రీ సేవలకు ఏ విధంగా అనుమతి ఇచ్చారు అని నిలదీసింది. 

 

ప్రైవేట్ కేంద్రాల్లో కూడా పరిక్షలు చేయించుకోవడం ప్రజల హక్కు అని హైకోర్ట్ స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రులు ల్యాబ్ లు కరోనా పరిక్షల కోసం ఐసిఎంఆర్ కి దరఖాస్తు చేసుకోవాలని హైకోర్ట్ సూచనలు చేసింది. వైద్య సిబ్బంది, సదుపాయాలను ఐసిఎం ఆర్ పరిశీలించి అనుమతులు ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అన్నీ చూసిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: