ఈరోజు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం నుంచే సెలబ్రిటీల నుంచి ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రారంభమయ్యాయి. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు జరిపారు. అభిమానులు ఎన్టీఆర్ కోరిక మేరకు లాక్ డౌన్ వల్ల ఇళ్లకే పరిమితమై సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. 
 
కొన్ని నిమిషాల క్రితం ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఎన్టీఆఅర్ తన ట్వీట్ లో అభిమానులు తనపై చూపిస్తున్న అభిమానం వెల కట్టలేనిది అని అన్నారు. అన్నింతా తనకు తోడుగా వస్తున్న అభిమానులే తన బలం అని చెప్పారు. ఏమిచ్చి అభిమానుల రుణం తీర్చుకోగలను...? ఏం చేసి మీ ప్రేమకు అర్హుడిని కాగలను...? చివరివరకు అభిమానులకు తోడుగా ఉండటం తప్ప అని ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: