మన దేశంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తున్న సంగతి తెలిసిందే. రోడ్డు, రైలు, విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. కేంద్రం వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల నుంచి భారత్ కు రప్పిస్తోంది. అయితే లాక్ డౌన్ వల్ల దక్షిణాఫ్రికాలో చిక్కుకుపోయారు. దాదాపు 1400 మంది అక్కడ చిక్కుకున్నారని తెలుస్తోంది. ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. 
 
కేంద్రం చొరవ చూపి భారత్ కు రప్పించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము తిండి, నీళ్లు లేక ఆకలితో అలమటిసున్నామని చెబుతున్నారు. బిజినెస్, టూరిస్ట్, స్టూడెంట్ వీసాలపై వాళ్లు అక్కడికి వెళ్లారని తెలుస్తోంది. తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కేంద్రం త్వరగా స్పందించాలని కోరుతున్నారు. ప్రముఖ ఛానల్ ద్వారా బాధితులు తమ కష్టాలను చెప్పుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: