తెలంగాణా మంత్రులు గంగుల కమలాకర్, ఈటెల రాజేంద్ర కాసేపు హడావుడి చేసారు. ఇక వారితో పాటుగా అదే కారులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒదితల సతీశ్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నారు. ఈ సందర్భంగా గంగుల కారు నడిపారు. కలెక్టరేట్ల సమీక్షా సమావేశం వరకూ ఆయన కారు నడిపించారు. 

 

ఈ పరిణామం తో ట్రాఫిక్ సిబ్బంది కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కారు నడుపుతున్న మంత్రిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసారు. కారు జాగ్రత్తగా నడుపు అన్నా అంటూ వ్యాఖ్యానించగా స్పందించిన మంత్రి కాస్త ఆసక్తికర వ్యాఖ్య చేసారు. మన బాస్ ట్రైనింగ్ ఇచ్చినట్లు నడుపుతున్నా అన్నా.. గమ్యానికి సురక్షితంగా చేరుతామంటూ సమాధానం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: