ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి సిద్దమయ్యారు. మేధోమధన సదస్సులు చేయనున్నారు జగన్. 5 రోజుల పాటు వరుసగా ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. తొలి రోజున వ్యవసాయంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 

 

రెండో రోజున విద్యా శాఖ మూడో రోజున వైద్య ఆరోగ్య శాఖ పై ఆయన సమీక్ష నిర్వహిస్తారు. నాలుగో రోజు వాలంటీర్ వ్యవస్థ ఐదో రోజు ప్రణాలికా విభాగం పై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఆయన రైతులతో, వాలంటీర్లతో నేరుగా మాట్లాడతారు. అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏమి కావాలి, రైతులను నేరుగా అడిగి తెలుసుకుంటారు. ఇక కరోనా తర్వాత వ్యవసాయ శాఖకు ఏమి చెయ్యాలి అనే దానిపై నేరుగా క్షేత్ర స్థాయి అధికారులను కూడా అడుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: