IHG


 ప్రజలను పాలించే అధినేతలు భద్రత లేనిదే బయటకు   రారు అనే విషయం మనకు తెలిసినదే. ఎందుకంటే వారిని అభిమానించేవారు మరియు వారి శత్రువులు ఒక్కసారిగా ఎగబడతారు అన్న ఉద్దేశంతోనే వారికి కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధిక వ్యక్తిగత రక్షణ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కి ఉంది. ఈయనకు ఎంత వ్యక్తిగత రక్షణ ఉంటుందో ఇటీవల  భారత్ లో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో గమనించే ఉంటాం. ట్రంపు భద్రత ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా ఆ ప్రోగ్రాం లో చూసాము.  ట్రంప్ తన వ్యక్తిగత రక్షణ కోసం రోజుకు 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారట.

 

 

ప్రపంచంలో అంతటి వ్యక్తిగత రక్షణను కలిగి ఉన్న దేశం బ్రిటన్. ప్రస్తుత బ్రిటన్ మహారాణి కూడా అదే స్థాయిలో భద్రతను కలిగి ఉన్నారు. వీరిద్దరి తర్వాత ప్రపంచంలోనే అత్యంత వ్యక్తిగత భద్రత ఉన్న మూడో శక్తివంతమైన వ్యక్తిగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. మన భారత ప్రధాని  ఏడు అంచెల రక్షణ వ్యవస్థను వినియోగిస్తున్నారు. అత్యవసర స్థితి లో మోడీకి రక్షణ కల్పించటానికి   5,200 మంది మోడీ కి రక్షణ కోసం సిద్ధంగా ఉంటారు. విపత్కర పరిస్థితులలో ఆయనకు ఏడు అంచెల రక్షణ వ్యవస్థను అందిస్తారు. మోడీ తర్వాత స్థానంలో కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉన్నారు. ఈయన రక్షణ  కల్పించుటకు గాను ఎల్లవేళలా2000 మంది సిద్ధంగా ఉంటారు. ఈయన తర్వాతి స్థానంలో చైనా అధ్యక్షుడు   జిన్ పింగ్ ఉన్నారు. ప్రపంచంలో వ్యక్తిగత రక్షణ కలిగిన ఐదో వ్యక్తిగా ఈయన ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: