IHG

 ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ సర్వీసులు మూలన పడ్డ విషయం తెలిసిందే. కరోనా వ్యాపిస్తుందన్న భయంతో ఆర్టీసీ యాజమాన్యం బస్సు సర్వీసులను నిలిపివేసింది. తాజాగా  గ్రీన్ మరియు   ఆరెంజ్ జోన్లలో బస్సులను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి బస్సు సర్వీసులను మొదలు పెట్టింది. రిజర్వేషన్లు కూడా మొదలు అయ్యాయి. ప్రస్తుతం ఏపీలో సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ , పల్లె వెలుగు బస్సులను మాత్రమే ఏపీ ఎస్ ఆర్టీసీ నడపననుండి. ఇవి అన్నీ కూడా నాన్ స్టాప్ సర్వీసులు కావడం విశేషం. ప్రధాన  నగరాల నుంచి ప్రధాన నగరానికి  ఈ బస్ సర్వీసులు  నడుపనున్నారు. అయితే ఈ సర్వీసులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే నడుస్తాయి.

 

 బస్సు స్టేషన్లలో ఆయా ప్రాంతాలకు టికెట్లు ఇచ్చే సౌకర్యాన్ని ఏపీ ఆర్టీసీ మొదలు  పెట్టనుంది. ప్రతి డిపోలను శానిటైసర్లను అందుబాటులో ఉంచవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1500 బస్సులు రోడ్లు ఎక్కనున్నాయి. బస్సులో ప్రయాణించే వారందరూ కూడా మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని ఏపీ ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. ప్రతి బస్టాండ్లో కూడా ఇకపై మాస్కులు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఈ మాస్క్ ల ధర 10 రూపాయలకు మించి ఉండకూడదని ప్రభుత్వం సూచించింది. ఈ బస్సు సర్వీసుల లో  అత్యవసరమైతే నే పిల్లలను, వృద్ధులను అనుమతి ఇస్తామని ఆర్టీసీ ఎండి మాదిరెడ్డి ప్రతాప్ వెల్లడించారు. వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, జర్నలిస్టులు మరియు వివిధ వర్గాల వారికి రాయితీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే వీరికి కూడా ఇతర ప్రయాణికులు లాగానే టికెట్లను జారీ చేస్తామని ఆయన తెలిపారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: