పన్నులు, సుంకాల్లో తెలంగాణ‌ రాష్ట్రం వాటాగా  రూ. 982 కోట్ల నిధులను కేంద్ర ప్ర‌భుత్వం విడుదల చేసింది. అన్ని రాష్ర్టాలకు కలిపి మే నెలకు సంబంధించి మొత్తం రూ. 46,038 కోట్లు విడుదలయ్యాయి. 15వ ఆర్థిక కమిషన్‌ సిఫారసు మేరకు ఆయా రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను అందిస్తోంది.  ఏప్రిల్‌లో కూడా తెలంగాణ వాటా కింద దాదాపు ఇదే మొత్తంలో నిధులను కేంద్రం విడుదల చేసింది.

 

దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి. ఇప్ప‌టికే ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. కొద్దిరోజులుగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌టించిన ప్యాకేజీల‌పై కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. 



 

మరింత సమాచారం తెలుసుకోండి: