ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనంత‌పురం జిల్లా ఓ రికార్డు క్రియేట్ చేసింది. జ‌రిమానాలు విధించడంలో జిల్లా పోలీసులు మొద‌టిస్థానంలో నిలిచారు. జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. మార్చి 23 నుంచి ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ నిబంధనల ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీన ప్రభుత్వం జిల్లాల వారీగా  జరిమానాల విషయంలో ప్రకటించిన జాబితాలో అనంతపురానికి అగ్రస్థానం దక్కింది.

 

జిల్లాలో అప్పటికి రూ. 4.26 కోట్ల జరిమానా విధించారు. ఇక‌ మార్చి 23 నుంచి ఇప్పటి వరకూ 57 రోజులలో 1,62,282 వాహనాలపై రూ. 6,02, 24,250లు జరిమానాలు విధించారు. ఏకంగా 3,708 వాహనాలు సీజ్‌ చేశారు. రా ష్ట్రంలో మ‌రెక్కడా లేని విధంగా లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై అనంత‌పురం జిల్లా పోలీసులు జరిమానాలుతో పాటు వాహనాలు సీజ్‌ చేయడం గ‌మ‌నార్హం. పోలీసుల దూకుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: