దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారితో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది.  ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఈ చిన్నా పెద్దా అందరూ కరోనా గురించే మాట్లాడే పరిస్థితి నెలకొంది.  సామాజిక దూరం, మాస్క్, శానిటైజర్ ఇవి మనిషికి తప్పని సరి మార్గదర్శకాలు అయ్యాయి.  అయితే కొంత మంది కరోనా పరిస్థితి భరించలేక ఉన్మాదులుగా మారుతున్న విషయం తెలిసిందే.  ఆ మద్య కరోనా సమయంలో మద్యం షాపులు తెరుచుకోకపోవడంతో చాలా మంది పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లింది.. ఎర్రగడ్డ ఆసుపత్రికి క్యూ కట్టారు.  ఇప్పుడు మద్యం షాపులు తెరుచుకున్న తర్వాత కొంత మంది మందు ఎక్కువ కావడం.. అందులో కరోనా కష్టాలు గుర్తుచేసుకొని బాధపడటం పిచ్చి పనులు చేయడం జరుగుతుందని కొంత మంది అంటున్నారు. 

 

తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ షాక్ తిన్నారు.  భార్యకు కరోనా వైరస్ సోకిందన్న బాధతో ఓ వ్యక్తి ఇంటి బయటకు వచ్చి కనిపించిన వాహనాలకు నిప్పు పెట్టాడు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే.. లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో నివసించే ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. భార్య మహమ్మారి బారినపడడంతో తట్టుకోలేకపోయిన ఆమె భర్త మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి బాపూనగర్‌లో మద్యం తాగాడు. అప్పటికే తన మానసిక పరిస్థితి పూర్తిగా అదుపు కోల్పోతున్న ఆ వ్యక్తి  రెండు ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోకు నిప్పుపెట్టాడు.  బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: