తమిళ స్టార్ హీరో సూర్య, అతని భార్య జ్యోతిక కలిసి నటించిన పోన్మగల్ వందాల్ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. కాసేపటి క్రితం దీనికి సంబంధించిన ట్వీట్ ని టాలీవుడ్ యంగ్ హీరో రానా కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. 

 

అయితే నిర్మాతలకు థియేటర్ యాజమాన్యాల నుంచి ఇబ్బందులు రావడం తో సినిమాను విడుదల చేయడం ఇబ్బందిగా మారింది. ఈ సినిమాను ఎలా విడుదల చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమా బడ్జెట్ తక్కువ కావడంతో ఓటీటీ లో విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ఈ నెల 29 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: