టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఎట్టకేలకు నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో తను ఫోటోలను షేర్ చేసాడు. ఈ ఫోటోలో కాబోయే సతీమణి మిహికా బజాజ్ పక్కన రానా తెల్ల పంచెలో కనిపించాడు. ఇద్దరూ కలిపి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. 

 

అసలు ఈ నిశ్చితార్ధం విషయంలో ముందు నుంచి అనేక వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మొన్న సాయంత్రమే నిశ్చితార్ధం జరుగుతుంది అని భావించారు. కాని అప్పుడు రెండు కుటుంబాలు కలుస్తున్నాయని అదేమి లేదని రానా తండ్రి సురేష్ బాబు మీడియా కు వివరించారు. అయితే అనూహ్యంగా రానా నిశ్చితార్ధం చేసుకుని ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ఇక అతనికి అభిమానులు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: